పవన్ డిప్యూటీ, విజయ్ సీఎం అయ్యారు.. మీరేమవుతారంటే.. సీనియర్ నటుడు అర్జున్ సమాధానం ఇదే

  • ప్రజలకు సేవ చేయాలని ఉంది కానీ రాజకీయాలపై ఆసక్తి లేదన్న అర్జున్
  • పర్సంటేజీ విధానం గురించి తనకు అవగాహన లేదని వెల్లడి
  • పెద్ద డైరెక్టర్లంతా ఒకప్పుడు మొదటి సినిమాతో మొదలు పెట్టినవారేనని వ్యాఖ్య
ప్రజలకు సేవచేయాలని ఉందని, కానీ తనకు రాజకీయాలు అంటే ఆసక్తి లేదని ప్రముఖ సినీ నటుడు అర్జున్ అన్నారు. అర్జున్ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా నటించిన 'ఒకేఒక్కడు' చిత్రం అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ ఆరంగేట్రం గురించి మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు.

టాలీవుడ్ నుంచి పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారని, కోలీవుడ్ నుంచి విజయ్ ముఖ్యమంత్రి అయ్యారని, మరి మీరు రాజకీయాల్లోకి వస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, నేను బాగుండటం మీకు ఇష్టం లేదనుకుంటానని చమత్కరించారు. అర్జున్ నటించిన కొత్త సినిమా 'బ్లాస్ట్:జోన్' ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడారు.

టాలీవుడ్‌లో పర్సంటేజీ విధానం గురించి ఆయన మాట్లాడుతూ, ఈ వ్యవహారం గురించి తనకు అవగాహన లేదని తెలిపారు. ఇప్పుడున్న పెద్ద పెద్ద డైరెక్టర్లంతా ఒకప్పుడు మొదటి సినిమాతో మొదలు పెట్టిన వారేనని, శంకర్ కూడా అలా మొదలు పెట్టిన వారే కదా అన్నారు. కొత్త ప్రతిభపై తనకు గౌరవం ఉందని, నూతన దర్శకుల్లో ఫైర్ ఉంటుందని అన్నారు. 'బ్లాస్ట్:జోన్'ను కూడా కొత్త డైరెక్టర్ బాగా తీశారని చెప్పారు.

Arjun Sarja
Arjun
Pawan Kalyan
Vijay
Blast Zone
Tollywood
Kollywood
Politics
Telugu Cinema
Tamil Cinema

More Telugu News